ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి ప్రధాని అయిన తెలంగాణ బిడ్డ PV..: స్పీకర్ Pocharam

ABN, First Publish Date - 2022-06-28T20:52:25+05:30

దేశానికి ప్రధాని అయిన పీవీ తెలంగాణ బిడ్డని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): పీవీ నరసింహరావు (PV Narasimha Rao) 101వ జయంతి సందర్భంగా శాసనసభ లాబీ హాల్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి విప్ యంయస్ ప్రభాకర్ రావు, అసెంబ్లీ సెక్రెటరీ డా.వి.నరసింహాచార్యులు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశానికి ప్రధాని అయిన పీవీ తెలంగాణ బిడ్డని కొనియాడారు. ఈ రోజు దేశం ఆర్ధిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే దానికి కారణం పివీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు. భూ సంస్కరణలను కూడా అమలు చేసింది ఆయనేనన్నారు. పీవీ చూపించిన బాటలో మనమందరం పయనించాలని పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. 


శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే 130 కోట్ల మంది ప్రజలు గౌరవించే వ్యక్తి పీవీ అన్నారు. 14 భాషలు తెలిసిన బహు భాషా కోవిదుడని కొనియాడారు. మనమందరం ఆయనను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వారి ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2022-06-28T20:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising