ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నజీయర్‌ స్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే సీతక్క

ABN, First Publish Date - 2022-03-16T18:06:50+05:30

చిన్నజీయర్‌ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్‌ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిన్నజీయర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా తల్లులది వ్యాపారమా?... మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా?... మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు, కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడ్డానికి  150 రూపాయలు టికెట్ ధర పెట్టారు. ఎవరిది వ్యాపారం?... మీది బిజినెస్, సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’’ అని సీతక్క అన్నారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఏవరైనా పేద వారి ఇంటికి వెళ్ళారా? అని ప్రశ్నించారు. చిన్నజీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన్న జీయర్ స్వామికి తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-16T18:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising