ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనదారులకు Shocking News : ఇక వేగాన్ని బట్టి Fine.. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేశారో..

ABN, First Publish Date - 2022-05-28T14:27:01+05:30

వాహనదారులకు Shocking News : ఇక వేగాన్ని బట్టి Fine.. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేశారో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అక్రమ పార్కింగ్‌పైనా కొరడా..


హైదరాబాద్‌ సిటీ : పరిమితికి మించి వేగంగా (Speed) వెళ్లే వాహనాలకు వివిధ శ్లాబుల్లో చలానాలు (Challan) విధించేందుకు ట్రాఫిక్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కనీస వేగానికి మించి వాహనం నడిపితే.. వేగాన్ని గుర్తించి జరిమానా విధిస్తారు. ఉదాహరణకు 50 కి.మీ. పరిమితి ఉన్నప్పుడు దానికి మించి ఎన్ని కి.మీ. వేగంగా వెళ్తుందో పరిశీలించి, పరిమితి 10 కి.మీ. దాటితే ఓ రకం, 20 కి.మీ. దాటితే కాస్త ఎక్కువ, అలాగే 30 కి.మీ. దాటితే మరింతగా చలానాలు విధిస్తారు.


వాహనవేగాన్ని గుర్తించడానికి మరిన్ని ప్రాంతాల్లో స్పీడ్‌ లిమిట్‌ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పార్కింగ్‌కు కూడా చెక్‌ పెట్టనున్నారు. పార్కింగ్‌ ఏర్పాట్లు లేకుండా వ్యాపారం చేసే ప్రాంతాలను ట్రాఫిక్‌ పరంగా సమస్యాత్మకంగా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్‌లకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు వ్యాపార సంస్థల నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.



Updated Date - 2022-05-28T14:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising