ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలి

ABN, First Publish Date - 2022-06-02T11:13:26+05:30

పెనుబల్లిరూరల్‌, జూన్‌ 1 : రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు ఇచ్చారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

పెనుబల్లిరూరల్‌, జూన్‌ 1 : రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు ఇచ్చారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కొనసాగింది. కొత్తకుప్పెనకుంట్లలో నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె మాట్లాడారు.  సీఎం కేసీఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తానని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుని వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు.  తన తండ్రి వైఎ్‌సఆర్‌ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోన్‌సలు కూడా ఇచ్చి పంట కొనుగోలు చేశారని గుర్తుచేశారు. సాయంత్రం గంగదేవిపాడులో  మాటాముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటున్న ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ పింఛన్‌ ఇస్తామని, ప్రతి కుటుంబానికి మహిళల పేరుతో పక్కా ఇల్లు ఇస్తామని చెప్పారని, ఏదీ అమలుచేయలేదని విమర్శించారు.  

నేటి పాదయాత్ర

గురువారం తాళ్లపెంట, బ్రహ్మళకుంట మీదగా బత్తులపల్లి కాలనీ వద్ద కల్లూరు మండలంలోకి ప్రవేశిస్తారు. బత్తులపల్లికాలనీలో రైతుగోస ధర్నాలో పాల్గొంటారు. అనంతరం కప్పలబంధం మీదగా కల్లూరు చేరుకుని రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ ఆత్మీయసదస్సుల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-06-02T11:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising