ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Seva Bharathi: సేవా కార్యక్రమాలపై గ్లోబల్ డాటా సీఈఓ ప్రశంసల జల్లు

ABN, First Publish Date - 2022-10-18T00:23:22+05:30

హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని సేవా భారతి హెల్త్ కేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని సేవా భారతి హెల్త్ కేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆరో బ్యాచ్ విద్యార్ధినులకు కూకట్ పల్లిలోని వివేకానంద వృత్తి విద్యా కేంద్రంలో గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ డాటా సీఈఓ మైక్ డాన్సన్, హెచ్ఆర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏజీఎం వి.బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. యువతను, మహిళలను సాధికారులను చేయడంలో సేవాభారతితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని గ్లోబల్ డాటా సీఈఓ మైక్ డాన్సన్ చెప్పారు. సేవా భారతి కార్యక్రమాలను ప్రశంసించారు. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధిలో యువతకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దుతున్న సేవాభారతి సిబ్బందిపై హెచ్ఆర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏజీఎం వి.బాలాజీ ప్రశంసల జల్లు కురిపించారు.    



బోయిన్‌పల్లిలోని సేవా భారతి హెల్త్ కేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మహిళలకు 3 నెలల నర్సింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగాలు రావడంలో కూడా సేవాభారతి సహకరిస్తోంది. స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఆవరణలోనే అవసరమైన విద్యార్ధినులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నారు. కనీస విద్యార్హత 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని నిర్వాహకులు తెలిపారు. కోర్సులో ఉత్తీర్ణులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వ ధృవీకరణ పత్రం అందిస్తారు. మరిన్ని వివరాలకు 040 -27950056, 9704387050, 9346827859, 9603009355 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 





Updated Date - 2022-10-18T00:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising