Chalapathy Rao: టాలీవుడ్లో మరో విషాదం..సీనియర్ నటుడు కన్నుమూత
ABN, First Publish Date - 2022-12-25T07:07:52+05:30
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు
హైదరాబాద్: టాలీవుడ్(Tollywood)లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) (senior actor Chalapathy Rao) కన్నుమూరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని(Banjara Hills) స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1944 మే 8న కృష్ణా జిల్లా(Krishna District) బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1,200 పైగా సినిమాలలో నటించారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. నిర్మాతగా 7 సినిమాలను నిర్మించారు.
సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చలపతిరావు సినీరంగ ప్రవేశం చేసిన ఆయన మూడు తరాల హీరోలతో చలపతిరావు పని చేశారు. 1966లో 'గూడచారి 116' చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు. సంపూర్ణ రామాయణం, యమగోల, డ్రైవర్ రాముడు, బొబ్బిలి పులి, ప్రేమకానుక, బొబ్బిలి బ్రహ్మన్న, ఖైదీ వంటి హిట్ చిత్రాల్లో చలపతి రావు నటించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, అర్థరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి.. చిత్రాలి నిర్మించారు.
Updated Date - 2022-12-25T09:10:16+05:30 IST