ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12.24 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు సీజ్‌

ABN, First Publish Date - 2022-06-02T09:30:41+05:30

వికారాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.  వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో ఓ వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడనే పోలీసులకు సమాచారం అందింది. వికారాబాద్‌ మండల వ్యవసాయాధికారి పాండురంగాచారి, పోలీసు సిబ్బంది అక్కడికెళ్లి చూడగా సిద్దులూరు బస్టాండ్‌ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ వ్యక్తిని యాలాల్‌ మండలం సంగెంకుర్ధు గ్రామానికి చెందిన గంజిపల్లి శ్రీనివా్‌సగా గుర్తించారు. అతడి వద్ద ఎలాంటి అనుమతులు లేని పత్తి విత్తనాలు లభించాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సంగెకుర్థు గ్రామంలోని అతని ఇంట్లో తనిఖీ చేయగా.. 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వాటి విలువ రూ.12.24 లక్షలుగా అంచనా వేశారు. ఆ విత్తనాలను రఘు, కృష్ణచౌదరి అనే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపాడు. 


Updated Date - 2022-06-02T09:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising