ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secunderabad Railway station అల్లర్ల కేసులో కీలక విషయాలు

ABN, First Publish Date - 2022-06-20T19:28:49+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసు లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway station) అల్లర్ల కేసు (case)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధ్వంసం వెనక ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీ (Private Defense Academy)ల పాత్ర ఉన్నట్లు పోలీసులు (Police) గుర్తించారు. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు (Subbarao) పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. కాగా ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును.. తెలంగాణ పోలీసులు (Telangana police) ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడినవారు సాయి అకాడమీకి చెందినవారిగా గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఆందోళన చేసిన కొంతమంది యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆవుల సుబ్బారావు విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సంప్రదించలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. సుబ్బారావు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసి.. తన ప్రసంగాలతో అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి.. ఆందోళన కార్యక్రమానికి పథకం పన్ని.. అందుకు వేదికగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి.. వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌చేసి.. అభ్యర్థులను తరలింపులో అన్నీతానై వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Updated Date - 2022-06-20T19:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising