ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనలపై సజ్జనార్ ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2022-04-12T17:58:59+05:30

డీజీల్ ధరల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డీజీల్ ధరల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపుపై ప్రజల్లో అసంతృప్తి లేదని, చాలా మంది తనతో మాట్లాడారని అన్నారు. నాలుగు నెలలుగా డీజీల్ ధర బాగా పెరిగిందని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ఇప్పటి వరకు సర్దుబాబు చేసుకుంటూ నెట్టుకొచ్చామని, మార్చి నెల నుంచి చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టంలో ఉందని, కోవిడ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ వచ్చిందని, ఇప్పుడు డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ ఇంకా నష్టంలో కూరుకుపోయే అవకాశం ఉందని, అందుకే డీజిల్ సెస్ పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు సజ్జనార్ చెప్పారు.

Updated Date - 2022-04-12T17:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising