ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల కోసం ఆర్టీసీ ’గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌’

ABN, First Publish Date - 2022-11-03T05:22:15+05:30

ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టిసారించిన టీఎ్‌సఆర్టీసీ యాజమాన్యం ‘గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌’ పేరిట ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టిసారించిన టీఎ్‌సఆర్టీసీ యాజమాన్యం ‘గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌’ పేరిట ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా సంస్థలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ’హెల్త్‌ ప్రొఫైల్‌’ రూపొందించనుంది. నవంబరు 3 నుంచి ప్రారంభమయ్యే ‘గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌’ పోస్టర్‌ను సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం బస్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఆరోగ్యపరంగా సరిగ్గా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు. గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌ను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ డీఎంలు, రీజియన్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కృషి చేయాలని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణతోపాటు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్‌ ప్రొఫైల్‌ ఉపయోగపడుతుందన్నారు. తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ డేటా బేస్‌లో సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-11-03T05:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising