ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం: రేవంత్

ABN, First Publish Date - 2022-04-13T18:06:44+05:30

హైదరాబాద్: గవర్నర్ తమిళి సైతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్ తమిళి సైతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయని, వాళ్లకు బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.


8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని, రూ. 2వేల 6 వందల కోట్ల విలువైన బియ్యం మాయంపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు.. ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒడ్లు కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఏదో పాకిస్తాన్ ప్రధాని కొనాలి అన్నట్లు ధర్నాలు ఎందుకని ప్రశ్నించారు. రైతుల చావుకు కారణమైన టీఆర్ఎస్, బీజేపీని రైతులు ఉరేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-13T18:06:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising