ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News.. వారి అరెస్ట్ అప్రజాస్వామికం..: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-06T18:39:20+05:30

యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘం నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘం నాయకుల అరెస్ట్ (Arrest) అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  (Revanth Reddy) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కోసం శాసనసభకు వచ్చి ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నగర నాయకులు, రాష్ట్ర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం చట్టవిరుద్దమన్నారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజా సమస్యలపై నాయకులు వినతిపత్రాలు ఇవ్వడం సహజమని అన్నారు. దాన్ని ఆసరా చేసుకొని హైదరాబాద్‌తో పాటు చుట్టూ పక్కల ఉన్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. నగరంలో కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతిలపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అర్హులకు రూ.3,016 నిరుద్యోగభృతిని అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-06T18:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising