ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కాస్త గౌరవం కూడా పోయింది: Revanth Reddy

ABN, First Publish Date - 2022-06-14T23:45:07+05:30

హైదరాబాద్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సీఎం కేసీఆర్ భేటిపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారని విమర్శించారు. ఉండవల్లి అంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సీఎం కేసీఆర్ భేటిపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారని విమర్శించారు. ఉండవల్లి అంటే.. సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేదని..కేసీఆర్‌తో భేటీ తర్వాత అది కాస్త పోయిందన్నారు. కేసీఆర్ బీజేపీపై పోరాడితే..కేసీఆర్ చేసిన అవినీతి పై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. 

ఇంకా ఇలా అన్నారు..‘‘రాష్ట్ర విభజనపై ఉండవల్లి రాసిన రెండు పుస్తకాలలో తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారు. తెలంగాణ కోసం పోరాడిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి , పొన్నం ప్రభాకర్‌ను విమర్శించారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఇంటికి పిలిచి మాట్లాడారు. సార పాతదే..సీసా కొత్తది అన్నట్లు.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తారట.. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లంతా..బీహార్ వాళ్లే.. టీఆర్ఎస్ కాదు.. అది బీహార్ పార్టీ..తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే..తెలంగాణ సమాజం ఊరుకోదు.’’ అని అన్నారు.

Updated Date - 2022-06-14T23:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising