ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములకు పట్టాలేవి: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-06-24T23:01:10+05:30

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ ఊసే మరిచారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ ఊసే మరిచారని  విమర్శించారు. పోడుభూమి రైతులకు పట్టాలిచ్చి యజమానులు చేసింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని,వందల మంది ఆదివాసీలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. గిరిజన భూములు లాక్కుని లే అవుట్‌లు వేస్తున్నారని, పోలీసులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితులు రాష్ట్రం ఉందన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లతో పాటు మొత్తం అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌వేనన్నారు. తాటి వెంకటేశ్వర్లు,  కాంతారావు చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగాగే పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.   

Updated Date - 2022-06-24T23:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising