ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ప్రజలు తిరుగుబాటు చేస్తారనే కేసీఆర్ కొత్త డ్రామా: రవీంద్రనాయక్

ABN, First Publish Date - 2022-10-04T21:21:42+05:30

ప్రజలు తిరుగుబాటు చేస్తారనే సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ నేత విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ప్రజలు తిరుగుబాటు చేస్తారనే సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ నేత రవీంద్రనాయక్ (Ravindra Naik) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఏ నేతా కేసీఆర్‌ను నమ్మలేదన్నారు. తాజాగా బీఆర్ఎస్ పేరుతో కొత్త నాటకం ప్రారంభించారని ఆరోపించారు. ఔట్ డేటెడ్ నేతలను పట్టుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికలు, ఉప ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి స్కీంలు ప్రకటిస్తారని విమర్శించారు. గత ఎనిమిదేళ్లుగా గిరిజనులకు ఎంత నిధులు ఖర్చు చేశారని ప్రశ్నించారు. తను ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


రిజర్వేషన్‌ల పెంపుపై టీఆర్ఎస్ గిరిజన మహిళా ఎంపీ ఎన్ని సార్లు మాట్లాడారని రవీంద్రనాయక్ ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్ని పథకాలు ఉన్నాయో టీఆర్ఎస్ గిరిజన ఎంపీ, మంత్రులకు తెలుసా? అన్నారు. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగించక పోవడంతో అవి వెనక్కి పోయాయన్నారు. గిరిజన బంధుకు నిధులు కేటాయించారా? ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. గిరిజన ఇంటికి రూ. 10 లక్షలు ఇచ్చిన తరువాతే ఉప ఎన్నిక ప్రచారానికి రావాలన్నారు. తెలంగాణ గురించి పోరాడిన కుటుంబాలను సీఎం కేసీఆర్ ఏనాడైనా కలిశారా? అని రవీంద్రనాయక్ ప్రశ్నించారు.

Updated Date - 2022-10-04T21:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising