ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ్‌గోపాల్‌ వర్మపై కేసులో స్టే

ABN, First Publish Date - 2022-05-28T08:53:03+05:30

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ)పై మియాపూర్‌ పోలీస్టేషన్‌లో నమోదైన చీటింగ్‌ కేసులో స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దిశ సినిమా విషయంలో మోసం చేశారంటూ..  

- నమోదైన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ)పై మియాపూర్‌ పోలీస్టేషన్‌లో నమోదైన చీటింగ్‌ కేసులో స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ‘దిశ’ సినిమా నిర్మాణం, వ్యాపారాల లావాదేవీలకు సంబంధించి వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ శేఖర ఆర్ట్స్‌కు చెందిన శేఖర్‌ రాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామ్‌గోపాల్‌ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై తాజాగా ధర్మాసనం వి చారణ చేపట్టింది. వర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం.. కేసులో మున్ముందు ఎలాంటి చర్య లు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-05-28T08:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising