ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wishes: సీఎం కేసీఆర్ ఇంట రక్షాబంధన్ వేడుకలు

ABN, First Publish Date - 2022-08-13T01:27:12+05:30

Hyderabad: రక్షా బంధన్ వేడుకలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమాప్యాయతలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: రక్షా బంధన్ వేడుకలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారిక నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమాప్యాయతలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తన ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సంప్రదాయ పద్ధతిలో వారికి ఆహ్వానం పలికారు. కేసీఆర్‌కు ఆయన అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన అక్కలకు కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు కేసీఆర్‌ను నిండు మనసుతో ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు తమ మనుమడు,మనుమరాలిని దీవించారు.   

Updated Date - 2022-08-13T01:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising