ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురూ శ్రీమంతులే!

ABN, First Publish Date - 2022-05-27T09:07:44+05:30

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులూ స్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఆర్‌ఎస్‌ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులు 

పార్థసారథి, వద్దిరాజు,  దామోదర్‌రావు  కోటీశ్వరులు

-వద్దిరాజు ఎన్నికపై గెజిట్‌ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులూ స్థితి మంతులే. వారు తమ నామినేషన్‌తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించి అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.  


- రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.35,31,18,349.10 కాగా.. అప్పులు రూ.12,10,34,346.52. ఇక, ఆయన భార్య విజయలక్ష్మి పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ.. రూ.7,29,37,365.17 కాగా.. ఆమె అప్పులు రూ.2,04,20,326.08.


- దామోదర్‌రావు స్థిరచరాస్తులు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నింటి విలువ కలిపి రూ.170,79,45,596 కాగా.. అప్పులు రూ.49,01,76,214. 


- బండి పార్థసారథి పేరిట ఉన్న స్థిర, చరాస్తులన్నింటి విలువ రూ.4023,28,87,108 (హిందూ అవిభాజ్య కుటుంబ కర్తగా ఆయనకున్న ఆస్తులు కూడా కలిపి) కాగా.. అప్పులు రూ.59,90,684. ఇక, ఆయన భార్య పేరిట ఉన్న స్థిరచరాస్తుల విలువ.. రూ.1276,92,64,571.00 కాగా, ఆమె అప్పులు రూ.13,89,185. ..కాగా, రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భారత సర్కారు నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర చట్ట, న్యాయ విభాగం మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్‌ను జారీచేసింది.

Updated Date - 2022-05-27T09:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising