ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ts News: దూకుడు పెంచిన రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం..

ABN, First Publish Date - 2022-07-27T19:36:01+05:30

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Resign) చేయనున్నట్లు తెలియవచ్చింది. మునుగోడు (Munugodu) నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో పలు మండలాల నేతలతో భేటీ అయ్యారు. బుధవారం మరో రెండు మండలాల నేతలతో సమావేశం కానున్నారు. అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా జరిగే ఉప ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక (By-election)కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ కదలికలతో కాంగ్రెస్ (Congress) అధిష్టానం అప్రమత్తమైంది. మునుగోడు అభ్యర్థి కోసం టీఆర్ఎస్ (TRS) గట్టి కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ కూడా పరిశీలిస్తోంది. 


టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. అలాగే కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. కాగా బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక ఖరారు అయినట్లు సమాచారం. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, వివేక్‌లతో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలియవచ్చింది. 

Updated Date - 2022-07-27T19:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising