ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం

ABN, First Publish Date - 2022-08-08T19:25:27+05:30

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): వానలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయింది. ఉమ్మడి ఖమ్మం, కుమురంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగామారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో  తెలంగాణలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఉన్నాయి.

Updated Date - 2022-08-08T19:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising