ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు, మూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు!

ABN, First Publish Date - 2022-05-28T08:21:40+05:30

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాగల రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాగల రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం ప్రకటించింది. శాటిలైట్‌ చిత్రాల ప్రకారం కేరళ తీరం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘావృతం పెరిగిందని, దీంతో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో ప్రవేశించటానికీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, లక్షద్వీప్‌ నుంచి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు పశ్చిమ గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలపడి బలంగా వీస్తున్నాయి. అదేక్రమంలో ఉత్తర కర్ణాటక, దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి శుక్రవారం బలహీనపడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-28T08:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising