ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే Raghunandan Raoకు నోటీసులు

ABN, First Publish Date - 2022-06-07T21:24:53+05:30

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు జూబ్లీహెల్స్ పోలీసులు నోటీసులు జారీ చశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan rao)కు జూబ్లీహెల్స్ పోలీసులు (Police) నోటీసులు జారీ చేశారు. 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో వీడియోలు ఫోటోలు బయట పెట్టారని అడ్వకేట్ కొమ్మిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనకు నోటీసులు, కేసులు కొత్త కాదని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలసి రాజకీయంగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఇదే మెదటి.. చివరి ఎఫ్ఐఆర్ కాదని, ఉద్యమంలో పోరాడిన వాడినని తెలిపారు. చట్టం తెలిసిన వాడిగా సాక్ష్యాలను మాత్రమే బయట పెట్టినట్లు తెలిపారు. కేసులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. 


చట్టం ముందు అందరూ సమానమేనని రఘునందన్ రావు అన్నారు. ఇతర నేతలకు లేని నిబంధనలు.. తన విషయంలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేం రాజకీయమో తనకు అర్థం కావడం లేదన్నారు. నిందితులను అరెస్ట్ చేయమని అడుగుతుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎంఐఎంను విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ ఎందుకు ఉలికిపడుతుందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-07T21:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising