ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిల్పకళావేదికలో ప్రిన్స్ రామవర్మ కచేరీ

ABN, First Publish Date - 2022-08-12T23:29:02+05:30

హైదరాబాద్: ప్రముఖ సంగీతవేత్త, కర్ణాటక సంగీత గాయకులు, సరస్వతి వీణా వాద్య కళాకారులు ప్రిన్స్ రామవర్మ (Prince Rama Varma) ఆగస్టు 13వ తేదీన (శనివారం) ఒక ప్రత్యేక సంగీత కచేరీ ద్వారా శాస్త్రీయ సంగీత ప్రియులను అలరించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ సంగీతవేత్త, కర్ణాటక సంగీత గాయకులు, సరస్వతి వీణా వాద్య కళాకారులు ప్రిన్స్ రామవర్మ (Prince Rama Varma) ఆగస్టు 13వ తేదీన (శనివారం) ఒక ప్రత్యేక సంగీత కచేరీ ద్వారా శాస్త్రీయ సంగీత ప్రియులను అలరించనున్నారు. హైదరాబాదులోని శిల్పారామంలో ఉన్న ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకూ జరిగే ఈ కచేరీలో వయొలిన్‌పై ఎస్ ఆర్ విను, మృదంగంపై బి హరికుమార్ ప్రిన్స్ రామవర్మకు వాద్య సహకారాన్ని అందిస్తారు. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ప్రిన్స్ రామవర్మ నిర్వహించే వర్క్‌షాప్స్‌కి హాజరవుతూ ఆయన వద్ద సంగీతం అభ్యసిస్తున్న పలువురు శిష్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కచేరీని ఏర్పాటు చేయడం విశేషం.


ప్రిన్స్ రామవర్మ (అశ్వతి తిరునాళ్ రామవర్మ) ట్రావెన్కోర్ రాజవంశీకులు. కర్ణాటక సంగీతంలో నిష్ణాతులుగా వెలుగొందుతున్నారు. మంచి రచయిత కూడా అయిన రామవర్మ అద్భుత ఉపన్యాసకులు, గొప్ప సంగీత ఉపాధ్యాయులు కూడా. అమెరికా, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి ఎందరో ఆయన నుంచి ఆన్‌లైన్ మాధ్యమంలో సంగీతం నేర్చుకుంటున్నారు, ఆయన వర్క్ షాప్స్‌కి హాజరవుతుంటారు. రామవర్మకు వర్క్ షాప్ విజార్డ్ అనే పేరుంది. హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, కె.ఎస్.నారాయణస్వామి వంటి ప్రముఖ సంగీత కళానిధుల నుంచి తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నారు.

Updated Date - 2022-08-12T23:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising