ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదగిరిగుట్టలో హెలికాప్టర్‌కు పూజ

ABN, First Publish Date - 2022-12-15T03:45:20+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో బుధవారం నూతన హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన కాప్టర్‌ను కొనుగోలు చేసిన ప్రతిమ గ్రూప్స్‌ అధినేత

హాజరైన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

యాదాద్రి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో బుధవారం నూతన హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఆలయానికి తీసుకువచ్చి పూజలు చేయిస్తుంటారు. అదే తరహాలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రతిమ మెడికల్‌ కళాశాల ఎండీ, ప్రతిమ గ్రూప్స్‌ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు నూతనంగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను యాదగిరిగుట్టకు తీసుకువచ్చారు. హెలికాప్టర్‌ను టెంపుల్‌ సిటీలోని హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేశారు. పూజారులు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. పూజల అనంతరం హెలికాప్టర్‌లో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, విద్యాసాగర్‌రావు కుటుంబ సభ్యులు గిరిప్రదక్షిణ చేశారు. బోయినపల్లి శ్రీనివాసరావు టెంపుల్‌ సిటీలోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లా డోనర్‌ కావడంతో వాహన పూజలు ఉచితంగా నిర్వహించారు.

Updated Date - 2022-12-15T03:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising