ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSR Vardhanthi.. సంక్షేమ స్పూర్తి దాత వైఎస్సార్.. కానీ ఇప్పటి ప్రభుత్వాలు..: పొన్నాల

ABN, First Publish Date - 2022-09-02T18:23:00+05:30

సంక్షేమ స్పూర్తి దాత వైఎస్సార్ అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సంక్షేమ స్పూర్తి దాత వైఎస్సార్ (YSR) అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు.  శుక్రవారం వైఎస్ఆర్ వర్ధంతి (YSR Vardhanthi) సందర్భంగా హైదరాబాద్, పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఇలా అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డని కొనియాడారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు అప్పులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు పునాదులు వేయడానికి వైఎస్సార్ అత్యధికంగా ఖర్చు చేశారన్నారు. పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు ఇవన్నీ వైఎస్సార్‌ను గుర్తు చేస్తాయన్నారు. వైఎస్సార్‌ను ఈ రాష్ట్రం, ఈ దేశం మరవదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది వైఎస్సార్ కల అని పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Updated Date - 2022-09-02T18:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising