రైతులకు లబ్ధి చేకురేలా హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్లు
ABN, First Publish Date - 2022-12-31T23:49:23+05:30
హెచ్ఎండీఏ లేఅవు ట్‌కు స్థలాలు ఇచ్చిన రైతులకు ప్రతిఫలంగా రూ.కోటి విలువ చేసే ప్లాట్ ఇస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.
హయత్‌నగర్, డిసెంబర్ 31 (ఆంధ్రజ్యోతి): హెచ్ఎండీఏ లేఅవు ట్‌కు స్థలాలు ఇచ్చిన రైతులకు ప్రతిఫలంగా రూ.కోటి విలువ చేసే ప్లాట్ ఇస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం రాగన్నగూడకు చెందిన 52 కుటుంబాలకు, మన్నెగూడ ప్రాంతానికి చెందిన 30 కుటుంబాలకు, మునగనూర్‌కు చెందిన 63 కుటుంబాలకు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఇచ్చే స్థలాలకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను ఆర్డీఓ వెంకటాచారితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. గత నెల లబ్ధిదారులకు ప్లాటు నంబర్లను కేటాయించిన ప్రభుత్వం శనివారం సర్టిఫికెట్లను అందజేసింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రూపాయి ఇవ్వకుండా పేదల భూములను తీసుకున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు ప్రతిఫలంగా కోటి రూపాయల విలువ చేసే ప్లాట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్లాట్లు పొందిన రైతులు వాటిని అమ్ముకోకుండా దాచుకున్నట్లయితే మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మునగనూర్, తొర్రూర్, రాగన్నగూడ, తుర్కయంజాల్, మన్నెగూడ రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, అబ్దు ల్లాపూర్‌మెట్ తహసీల్దార్ అనితారెడ్డి, కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి, సంగీత మోహన్‌గుప్తా, అనురాధ దర్శన్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, కిషన్‌గౌడ్, సామ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T23:49:26+05:30 IST