ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : యజమాని మోసం చేశాడని.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-03-06T12:07:35+05:30

యజమాని మోసం చేశాడని.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : డబ్బులు ఇస్తానని నమ్మించి దుకాణం ఖాళీ చేయించిన భవన యజమాని డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. చైతన్యపురిలోని ద్వారకాపురానికి చెందిన రాజేందర్‌రెడ్డి చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు లైన్‌లో సెల్‌ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. అయితే భవనయజమాని ఆ దుకాణంలో వైన్‌షాపు పెట్టాలని యోచించి దుకాణం ఖాళీ చేయాలని, ప్రతిఫలంగా రూ. 10లక్షలు ఇస్తానని సెల్‌ఫోన్‌ నిర్వాహకుడిని ఒప్పించాడు. దుకాణం ఖాళీ చేశాక డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేశాడు.


డబ్బులు అడిగితే వేధింపులకు గురిచేశాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రాజేందర్‌రెడ్డి భార్యా పిల్లలను చెంచల్‌గూడలోని తన తల్లిదండ్రుల ఇంటి వద్దకు చేర్చాడు. ఆ తర్వాత శుక్రవారం తన ఫ్లాటులో తీసుకున్న సెల్ఫీవీడియోలో యజమాని చేసిన మోసాన్ని, వేధింపులను వివరించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఎంఐలు చెల్లించడం లేదని శనివారం ఉదయం బ్యాంకు అధికారులు ఫ్లాట్‌ వద్దకు వచ్చారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారితో కలిసి బలంగాతోసి తీశారు. దాంతో రాజేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న విషయం వెలుగుచూసింది.

Updated Date - 2022-03-06T12:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising