ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకటి నుంచి నుమాయిష్‌

ABN, First Publish Date - 2022-12-31T01:03:24+05:30

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) - 2023 ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2,400 స్టాళ్లతో ఏర్పాట్లు ఫ ప్రవేశ రుసుం రూ.40

అఫ్జల్‌గంజ్‌, డిసెంబర్‌ 300 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) - 2023 ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జనవరి ఒకటిన నుమాయిష్‌ ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆశ్విని మార్గం తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానం గాంధీ సెంటీనరీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. నుమాయిష్‌లో సుమారు 2,400 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. గతేడాది నుమాయి్‌షను 14 లక్షల మంది సందర్శించారని, ఈసారి 20 లక్షలకు పైగా వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. మధ్యాహ ్నం 2 గంటల వరకు రూ.600 ఫీజుతో మైదానంలోకి కార్లను అనుమతిస్తామన్నారు. ఎగ్జిబిషన్‌ ప్రవేశ రుసుం రూ.40గా నిర్ణయించినట్లు వివరించారు. మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఒకటిన సాయంత్రం 5 గంటలకు ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో సొసైటీ సెక్రటరీ సాయినాథ్‌ దయాకర్‌ శాస్ర్తి, జాయింట్‌ సెక్రటరీ వనం సురేందర్‌, పబ్లిక్‌సిటీ చైర్మన్‌ హరినాథ్‌ రెడ్డి, కన్వీనర్‌ ధీరజ్‌ జైశ్వాల్‌, కన్వీనర్‌ ఆదిత్య మార్గం, అశోక్‌ హైదర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising