ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల అభ్యున్నతికి పాటుపడిన నేత ఎన్టీఆర్‌

ABN, First Publish Date - 2022-11-21T03:35:54+05:30

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి పునాదులు వేసి, అభివృద్ధి చేసి.. భావితరాలకు స్ఫూర్తి నింపిన నేత ఎన్టీఆర్‌ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో ఖమ్మంలో రూ.3కోట్లతో భారీ విగ్రహం: మంత్రి పువ్వాడ

ఖమ్మం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి పునాదులు వేసి, అభివృద్ధి చేసి.. భావితరాలకు స్ఫూర్తి నింపిన నేత ఎన్టీఆర్‌ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కొనియాడారు. ఆదివారం ఖమ్మంలో కమ్మమహాజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనసమారాధన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా త్వరలో ఖమ్మంలో రూ.3కోట్ల వ్యయంతో 30 అడుగుల ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఉండాలన్న లక్ష్యంతో రూ.2కే కిలో బియ్యం, పక్కా ఇల్లు, జనతా వస్త్రాల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలు అమలుచేసి భవిష్యత్‌ తరాలకు అభివృద్ధి బాటలు వేసిన మహానేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి.. సీఎం కేసీఆర్‌లో ఉందని, ఎన్టీఆర్‌తో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కలిసి ప్రయాణించిన కేసీఆర్‌ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వనభోజనాలు సమైక్యతకు నిదర్శనమని, సంస్కృ తి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని చెప్పారు. వ్యవ సాయంతోపాటు విద్యారంగంలోనూ రాణించాలన్నారు.

Updated Date - 2022-11-21T03:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising