ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నయనానందం.. నాట్య ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-20T06:07:21+05:30

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవీంద్రభారతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న నృత్యోత్సవం నయనానందంగా సాగుతోంది. భారతీయం (అఖిల భారత నృత్యోత్సవం) పేరిట జరుగుతున్న వేడుకల్లో భాగంగా శుక్రవా రం నాట్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుప గాయత్రిచే ఒడిస్సీ నాట్యం, గోపాల్‌ ప్రసాద్‌ దుబేచే కూచిపూడి, సుదీ్‌పకుమార్‌ ఏ మణిపూరి, పేరిణి ప్రకా్‌షచే పేరిణి నాట్యం తదితర అంశాల్లో నర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కళాకారులను సత్కరించారు. వజ్రోత్సవం సందర్భంగా తెలుగు వర్సిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నృత్యోత్సవం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రాఘవరాజ్‌భట్‌, కళాకృష్ణ తదితరులు పాల్గొని కళాకారులను సత్కరించారు. 

Updated Date - 2022-08-20T06:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising