ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

By Election.. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు: నారాయణ

ABN, First Publish Date - 2022-08-21T18:35:01+05:30

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత నారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (Tirupathi): మునుగోడు (Munugodu) ఉపఎన్నిక (By election)లో టీఆర్ఎస్‌ (TRS)కు సీపీఐ (CPI) మద్దతు ఇస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు, సీసీఐకు మధ్య రాజకీయంగా పెద్ద సంబంధాలు లేవన్నారు. అయితే బీజేపీ రాజకీయ ఆధిపత్యం కోసం మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదని, అందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిందన్నారు.


ఢిల్లీలో ఆప్ మంత్రిపై సీబీఐ దాడులు చేయడం దారుణమని నారాయణ అన్నారు. దేశంలో ఎన్డీఏకు వ్యతిరేకత మొదలైందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సీపీఐ ఉందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు తెలుపుతోందన్నారు. ఏపీలో మాత్రం బీజేపీకి అన్ని రాజీయపార్టీలు మద్దతు ఇస్తున్నాయని, చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్‌కే మురిసిపోతున్నారని విమర్శించారు. జగన్ తన సుఖం కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ గూటిలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. విశాల ప్రయోజనాల కోసం ఏపీలోని పార్టీలు బీజేపీని వీడి రావాలని పిలుపిచ్చారు. బీజేపీతో వైసీపీ అంటకాగితే వ్యతిరేకంగా పోరాడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతారో ఆ పార్టీకే మద్దతు ఇస్తామని నారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-21T18:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising