ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో స్టేషన్లలో హూ.. లలల్లా !

ABN, First Publish Date - 2022-06-22T13:56:20+05:30

అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్‌ అండ్‌ టీ ‘మెట్రో మెడ్లీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోతె జెంత్రం, ఉత్కర్స్‌స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో కలిసి వారం రోజుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

100 మంది కళాకారులతో 25 వరకు సంగీత ప్రదర్శనలు 


హైదరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్‌ అండ్‌ టీ ‘మెట్రో మెడ్లీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోతె జెంత్రం, ఉత్కర్స్‌స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో కలిసి వారం రోజుల పాటు 5 మెట్రో స్టేషన్లలో సంగీతకార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, వాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మెట్రో మెడ్లీ కార్యక్రమాన్ని అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ మెట్రో ప్రయాణికుల్లో ఆహ్లాదం నింపుతాయన్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎ్‌సరెడ్డి మాట్లాడుతూ సంగీతం ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ నగరవాసులకు ఈనెల 25 వరకు 5 మెట్రో స్టేషన్లలో 100 మంది కళాకారులతో నిర్వహిస్తోన్న ఈ ప్రదర్శనలు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందిస్తాయన్నారు. 

Updated Date - 2022-06-22T13:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising