ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

ABN, First Publish Date - 2022-02-04T18:12:01+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం ముచ్చింతల్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  పంచలోహాలతో చేసిన 216 అడుగుల విగ్రహం.. కుల, మత, జాతి విభేదాలు లేని సమానత్వం కోసం కృషి చేసిన శ్రీరామానుజాచార్యుల ఆదర్శాలకు ప్రతీక అని పీఎంవో పేర్కొంది. కూర్చునే భంగిమలో ఉన్న, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాల్లో ఇది ఒకటి అని అభివర్ణించింది. శ్రీరామానుజాచార్యుల జీవితం, బోధనలను వివరిస్తూ 3డీ ప్రదర్శన తర్వాత సమతా విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశాలను కూడా ప్రధాని సందర్శించనున్నారు. 


శ్రీరానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖుల పర్యటనలు ఖరారు కాగా.. మరికొందరి తేదీలు ఖరారు కావాల్సి ఉంది. శనివారం మోదీ, 12న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే వారి పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 8న వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

Updated Date - 2022-02-04T18:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising