ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఉద్యోగుల కోసం మొబైల్‌ యాప్‌: సజ్జనార్‌

ABN, First Publish Date - 2022-11-13T03:57:24+05:30

ఆర్టీసీ ఉద్యోగులకు పలురకాల సౌలభ్యం కోసం మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు పలురకాల సౌలభ్యం కోసం మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆర్టీసీలో వివిధ రకాల సేవలను డిజిటలైజ్‌ చేస్తున్న క్రమంలో ఉద్యోగుల విధినిర్వహణలో వారికి ఉపయోగపడే విధంగా రూపొందించిన ‘టీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్‌’ యాప్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 44,764 మంది ఉద్యోగులను సమన్వయం చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద బర్కత్‌పుర, కంటోన్మెంట్‌, హైదరాబాద్‌-2 డిపోలలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు రోజూవారీ సెలవులు, పే స్లిప్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామని ఆయన వివరించారు.

Updated Date - 2022-11-13T03:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising