ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా జైలుల్లో మైనర్లు?

ABN, First Publish Date - 2022-09-17T17:40:07+05:30

చంచల్‌గూడ మహిళా జైల్లో జువెనైల్‌ జస్టిస్‌ బోర్టు సభ్యులు శనివారం ఉదయం 11గంటలకు సందర్శించి తనిఖీలు చేపట్టనున్నారు. మహిళా జైలులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు తనిఖీలు చేపట్టనున్న జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు

హైదరాబాద్‌ సిటీ: చంచల్‌గూడ మహిళా జైల్లో జువెనైల్‌ జస్టిస్‌ బోర్టు సభ్యులు శనివారం ఉదయం 11గంటలకు సందర్శించి తనిఖీలు చేపట్టనున్నారు. మహిళా జైలులో సాధారణంగా 18ఏళ్లు దాటిన ఆరోపణ లు ఎదుర్కొనే మహిళలే ఉండాలనే నిబంధన ఉంది. 18ఏళ్ల లోపు మైనర్‌లు ఏదేని నేరం చేసి ఉంటే వారిని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది వయస్సులు తక్కువగా ఉండి.. ఆధార్‌కార్డులో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారిని ఆధార్‌కార్డు ఆధారంగా జైలుకు తరలిస్తే.. వారి స్టడీ సర్టిఫికెట్లలో వాస్తవ వయస్సు ఉండే అవకాశముంది. అలాంటి అను మానితులను పరీక్షించి.. వారి సర్టిఫికెట్లు నిర్ధారించి.. 18ఏళ్ల లోపు ఎవరైనా జైల్లో ఉంటే వారిని గుర్తించే ప్రయత్నంలో భాగంగా ఈ తనిఖీలు జరగనున్నాయని బోర్డు మెంబర్‌ చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇదే విధగా పురుషుల జైల్లో తనిఖీ చేయ గా.. ఐదుగురు మైనర్లు తప్పుడు జనన పత్రాల కారణంగా పురుషుల జైల్లో ఉన్నట్లు గుర్తించి వారిని అక్కడి నుంచి జువెనైల్‌ హోంకు తరలించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2022-09-17T17:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising