ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR Tweet: మోదీ సర్కార్‌పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

ABN, First Publish Date - 2022-10-02T18:45:43+05:30

మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మోదీ సర్కార్‌ (Modi government)పై మంత్రి కేటీఆర్(KTR) సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘మోదీ సర్కార్ ఎంతో ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపన్యాసాలు ఇస్తున్నారు... కానీ అంకెలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయి’’ అని అన్నారు. దేశానికి తెలంగాణ (telangana) ఇచ్చే ప్రతీ రూపాయిలో కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని తెలిపారు. అన్ని బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలలో రేషన్ షాపుల వద్ద ఈ వాస్తవాలతో బ్యానర్‌లు పెట్టాలని నిర్మాలాసీతారామన్‌ (Nirmala sitaraman)కు కేటీఆర్ (Telangana minister) చురకలంటించారు. ఈ 7 సంవత్సరాలలో కేంద్రానికి తెలంగాణ 365907 కోట్ల రూపాయలు పన్ను చెల్లించిందని చెప్పారు. కానీ కేంద్రం తిరిగి తెలంగాణకు 168647కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి 197150కోట్లు అదనంగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ వాస్తవాలను రేషన్ షాపుల వద్ద బ్యానర్‌లు పెట్టించండి అంటూ నిర్మాలాసీతారామన్‌‌ (Union minister)కు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. 

Updated Date - 2022-10-02T18:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising