ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం: మంత్రి KTR

ABN, First Publish Date - 2022-06-27T19:33:57+05:30

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (Delhi): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా (Yashwant Sinha)కు టీఆర్ఎస్ (TRS) మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నామన్నారు. భీష్ముడు మంచివాడైనా ఓటమి తప్పలేదన్నారు. ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 8 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏడు గిరిజన మండలాలను మాకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T19:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising