ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 శాతం సీవరేజ్‌ను ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్: కేటీఆర్‌

ABN, First Publish Date - 2022-03-02T18:27:35+05:30

100 శాతం సీవరేజ్‌ను ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతోందని 100 శాతం సీవరేజ్‌ను ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతోందని 100 శాతం సీవరేజ్‌ను ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించ బోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 100 శాతం సీవరేజ్‌ను ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతోందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం న‌గరంలోని పీపుల్స్ ప్లాజా వ‌ద్ద చెత్త త‌ర‌లించే 40 అత్యాధునిక వాహ‌నాల‌ను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరంలో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను రోజూ తరలిస్తున్నామన్నారు. 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, మరో 400 ఆటోలు నెల రోజుల్లో రాబోతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా చెత్త తరలింపు జరుగుతోందని, దక్షిణాదిలో చెత్త నుంచి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న నగరం హైదరాబాదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా రాంకీ సంస్థ ఈ ట్రక్కులను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే రోజూ 6,500 టన్నుల చెత్తను నగరం నుంచి జవహర్ నగర్ డంప్‌నకు తరలించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-02T18:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising