ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట మెడికల్ కళాశాల ర్యాగింగ్‌పై స్పందించిన మంత్రి Harish

ABN, First Publish Date - 2022-01-03T17:02:24+05:30

సూర్యాపేట మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై మంత్రి హరీష్ రావు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సూర్యాపేట మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై మంత్రి హరీష్ రావు స్పందించారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన విషయం తెలిసిందని... రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించామన్నారు. ఈ ఘటనకు కారకులను వదిలిపెట్టేది లేదని... ర్యాగింగ్ అనేది నిషేధమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 


సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి (1న) కొందరు సీనియర్లు బాధిత విద్యార్థి ఒంటిపై బలవంతంగా దుస్తులు తొలగించి  ఫోటోలు తీశారు. అంతే కాకుందా ట్రిమ్మర్‌తో జుట్టు తొలగించేందుకు యత్నించారు. సీనియర్ల నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థి హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ర్యాగింగ్ విషయాన్ని వివరించారు. విద్యార్థి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు. ర్యాగింగ్ ఘటనపై స్పందించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్... మెడికల్ కళాశాలలో విచారణకు చేపట్టారు. 

Updated Date - 2022-01-03T17:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising