ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి కలకలం.. Friends మధ్య ఘర్షణ.. కత్తిపోట్లు.. అసలేం జరిగింది..!?

ABN, First Publish Date - 2022-05-23T18:06:27+05:30

అర్ధరాత్రి కలకలం.. Friends మధ్య ఘర్షణ.. కత్తిపోట్లు.. అసలేం జరిగింది..!?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ప్రేమ వ్యవహారమే కారణమా?


హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : అలకాపూర్‌లో శనివారం అర్ధరాత్రి స్నేహితుల మధ్య (Friends) గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగ్‌కు చెందిన సయ్యద్‌ నషీర్‌, మహ్మద్‌ నవీద్‌, మహ్మద్‌ అక్బర్‌ స్నేహితులు. ఒకే ప్రాంతంలో ఉంటారు. శనివారం అర్ధరాత్రి ముగ్గురూ కలిసి మద్యం తాగారు.


తాగిన మత్తులో ఘర్షణకు దిగారు. అక్బర్‌, నవీద్‌ కత్తితో నషీర్‌ను దారుణంగా పొడిచారు. చనిపోయాడని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న నషీర్‌ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడుపులో, ఎడమ పక్కన షోల్డర్‌ పైన కత్తి పోట్లు ఉన్నాయని, చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే యువతిని వీరు ప్రేమించారని (Love), ఆ విషయంలోనే ఘర్ణణకు దిగి ఉంటారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం పాత కక్షల నేపథ్యంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - 2022-05-23T18:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising