ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజ్ఞాతంలో మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు

ABN, First Publish Date - 2022-07-10T18:43:31+05:30

Hyderabad: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ ఆరోపించింది. తనను, భర్తను రివాల్వర్‌తో బెదిరించడమే కాకుండా వేధింపులకు గురిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులను పోలీసులు నమోదు చేశారు.  సీఐ కోరట్ల నాగేశ్వరరావును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. బాధితురాలు, ఆమె భర్త స్టేట్మెంట్ నమోదు చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది.  సీఐ నాగేశ్వరరావుకు సైతం కరోనా ఉండే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. 


ల్యాండ్ కేసులో సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు  

మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ డిమాండ్ చేశారు. తనను ఓ ఆస్తి కేసులో అన్యాయంగా ఇరికించాడని ఆరోపించారు. తనకు సంబంధం లేదని చెప్పినా.. కేసు నుంచి పేరు తొలగించడంలో జాప్యం చేశాడని తెలిపారు. ఉన్నతాధికారులు, నేతలకు రూ.కోట్లు ఇచ్చి పోస్టింగ్‌ తెచ్చుకున్న తనకు అంతే డబ్బు కావాలని ప్రచారం చేసుకున్నాడని టీజీ ఆరోపించారు. సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందన్నారు.


సీఐకి కోసం గాలింపు

నాగేశ్వరరావుపై కేసు నమోదు కావడంతో సీఐని అదుపులోకి తీసుకునేందుకు SOT పోలీసులు వచ్చారు. అయితే తాను డ్యూటీలో ఉన్నానని..ఉదయం హాజరవుతానని నాగేశ్వరరావు చెప్పారు. రాత్రి 12:15 గంటల తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశారు. ఈ క్రమంలో తప్పించుకు  తిరుగుతున్న సీఐ నాగేశ్వరరావు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  





Updated Date - 2022-07-10T18:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising