మణుగూరుకు పాలిటెక్నిక్ కాలేజీ
ABN, First Publish Date - 2022-12-15T03:31:48+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌కాలేజీని మంజూరు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌కాలేజీని మంజూరు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాలేజీలో డిప్లమో ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, డిప్లమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లమో ఇన్ ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ కోర్సులను ప్రారంభించనున్నారు. కాలేజీ ఏర్పాటుకు రూ. 38.40 కోట్ల నిధులను విడుదల చేశారు. అలాగే, నారాయణపేట జిల్లా మక్తల్‌కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2022-23)నుంచే కాలేజీ మనుగడలోకి రానుంది.
Updated Date - 2022-12-15T03:31:49+05:30 IST