ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత కార్ల విడి భాగాలతో విద్యుత్‌ కారు తయారీ

ABN, First Publish Date - 2022-12-28T03:08:18+05:30

పాత కార్ల విడిభాగాలు, పాత బ్యాటరీలు తదితర వస్తువులతో విద్యుత్‌ కారు ను తయారుచేశాడు రాష్ట్రానికి చెందిన యువకుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే వంద కిలోమీటర్ల ప్రయాణం

జోగులాంబ గద్వాల జిల్లా యువకుడి ఘనత

అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 27: పాత కార్ల విడిభాగాలు, పాత బ్యాటరీలు తదితర వస్తువులతో విద్యుత్‌ కారు ను తయారుచేశాడు రాష్ట్రానికి చెందిన యువకుడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రా మానికి చెందిన బీచుపల్లి అఖిల్‌ సాధించాడీ ఘనత. విద్యార్థిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అఖిల్‌, బీకాంలో పట్టభద్రుడయ్యాడు. రాష్ట్రం సిద్ధించిన త ర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంలేదంటూ కొన్నేళ్ల క్రితం సుంకేసుల డ్యాం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసివార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఉద్యో గాల ప్రయత్నాలు మానుకొని ఆటో నడుపుతూ జీవనం సా గిస్తున్నాడు. ఈక్రమంలోనే వాహనతయారీపై మక్కువ పెం చుకున్నాడు. మూడేళ్ల క్రితం రూ. 80 వేల ఖర్చుతో విద్యుత్‌ ఆటో తయారు చేసి ఇంటింటా ఇన్నోవేషన్‌ కింద జిల్లా స్థాయికి ఎంపికై అవార్డును కలెక్టర్‌ చేతుల మీదుగా అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా విద్యుత్‌ కారును తయారుచేశాడు.

మారుతి-800కు చెందిన విడిభాగాలను, 1500 వాట్స్‌ సామర్థ్యం గల డీసీ మోటార్‌ను, 60 వోల్ట్‌ కంట్రోలర్‌, ఆటో టైర్లు, 130 ఏహెచ్‌ కెపాసిటీ గల నాలుగు బ్యాటరీలు, వీటన్నింటినీ అమర్చేందుకు ఐరన్‌తో కారును తయారు చేసి విజయవంతంగా నడిపించడగలిగాడు. తాను రూపొందించిన కారు కేవలం 3 గంటల విద్యుత్‌ చార్జింగ్‌తోసుమారు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, గంటకు 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని అఖిల్‌ వెల్లడించాడు. ఈ ఏడాది జనవరి 26న గ్రామస్థాయి అవార్డుకు ఎంపికయ్యానని, టీఎ్‌సఐసీ-హైదరాబాద్‌ ప్రదర్శనకు తనకు ఆహ్వానం లభిందని హర్షం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే సోలార్‌ విద్యుత్‌తో కారు రీచార్జి అయ్యేలా రూపకల్పన చేయగలనని అఖిల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-12-28T03:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising