ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంభోశంకర.. Maha Shivratri కి ఉపవాసం ఉంటున్నారా అయితే ఇవి మరిచిపోకండి..!

ABN, First Publish Date - 2022-03-01T12:57:31+05:30

శంభోశంకర.. Maha Shivratri కి ఉపవాసం ఉంటున్నారా అయితే ఇవి మరిచిపోకండి..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : మహాశివరాత్రికి నగరం ముస్తాబయింది. పలు శివాలయాలను విద్యుత్‌దీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాత్రివేళ శివపార్వతుల కల్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ మహా రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. జాగరణ నిర్వహించడానికి పలు ఆలయ ప్రాంగణాల్లో వివిధ సాంస్కృతిక, భజన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో  ఆలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.


కొండెక్కిన పండ్ల ధరలు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెటల్లో పూలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. భక్తులు ఉపవాసదీక్షలకు అల్పాహారంగా తీసుకునే పండ్ల ధరలు సాధారణ రోజులకంటే రెట్టింపుగా ఉండగా, పూలు మూర రూ.50, చామంతి, గులాబీలు 50గ్రా.లకు రూ.40 పైనే విక్రయించారు.


కీసర, ఏడుపాయలకు ప్రత్యేక బస్సులు

శివరాత్రి సందర్భంగా కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  ఎంజీబీఎస్‌ నుంచి ఈనెల 4వరకు ఏడుపాయల జాతరకు బస్సులు నడుపుతుంది. ఇతర వివరాలకు 9959226142, 9959226144, 9959226145, 9959226149, 9959226154లలో సంప్రదించవచ్చు.


కీసరలో కనులపండువగా బ్రహ్మోత్సవాలు

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో  భాగంగా రెండోరోజు సోమవారం వైదిక కార్యక్రమాలు కొనసాగాయి. నందివాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామలింగేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించారు.


ఉపవాసం వేళ.. ఇలా..

శివరాత్రి సందర్భంగా పెద్దలతోపాటుగా పిల్లలు కూడా ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపవాసం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని అంశాల గురించి న్యూట్రీషియనిస్ట్‌, డైటీషియన్‌ సునీత ఏం చెబుతున్నారంటే..


హైడ్రేషన్‌ తప్పనిసరి..

ఉపవాసం ఉన్నవారు శరీరాన్ని తగినంతగా హైడ్రేట్‌ చేయకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఉపవాస ఆరంభానికి ముందు లేదంటే తరువాత అయినా కీర దోసకాయ లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. 


ఫైబర్‌ అధికంగా తీసుకోవాలి

ఫైబర్‌ ఫుడ్స్‌ త్వరగా జీర్ణం కావు. త్వరగా ఆకలి వేయదు. ఇవి శరీరంలో నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. హోల్‌గ్రెయిన్స్‌, సలాడ్స్‌, సూప్స్‌, కూరగాయలు వంటివి ఈ ఫైబర్‌కు చక్కటి వనరులు.


పాల ఉత్పత్తులతో ప్రయోజనం

పాల ఉత్పత్తులను తీసుకోవాలి. శరీరానికి తగిన హైడ్రేషన్‌ అందించడమే కాదు, తగినంత శక్తినీ అందిస్తాయి. పాలు, మిల్క్‌ షేక్స్‌, లస్సీ, మజ్జిగ.. ఏ రూపంలో అయినా ఓకే. కాఫీలు, ఆ తరహా పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. కెఫిన్‌ డైయురెటిక్‌. దీనివల్ల త్వరగా శరీరం నీటిని కోల్పోతుంది.


సమతుల ఆహారం తీసుకోవాలి..

ఉపవాసం తరువాత సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. విటమిన్‌, మినరల్స్‌ మిశ్రమంలా ఈ ఆహారం ఉంటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. 


ఏం చేయకూడదంటే..

- ఒకరోజు ఉపవాసం ఉన్నామని, మరుసటి రోజు ఓ పట్టుబడితే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఉపవాసం తరువాత స్వీట్లు, సమోసాల లాంటి  వాటికి  దూరంగా ఉండాలి.

- చక్కెర వినియోగించి చేసే పదార్థాలు తినకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావడంతో పాటుగా అసౌకర్యమూ కల్పిస్తాయి. 

Updated Date - 2022-03-01T12:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising