ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 లక్షల లాటరీ గెలుచుకున్నారని Message.. కాసేపటికే ఫోన్ కాల్.. ఈ లోపే...!

ABN, First Publish Date - 2022-01-06T19:03:45+05:30

25 లక్షల లాటరీ గెలుచుకున్నారని Message.. కాసేపటికే ఫోన్ కాల్.. ఈ లోపే...!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : నగరానికి చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తిని లాటరీ పేరుతో మభ్యపెట్టిన కేటుగాళ్లు రూ. 6 లక్షలు కాజేశారు. ఇటీవల హుస్సేన్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. లాటరీలో మీ ఫోన్‌ నెంబర్‌ రూ.25లక్షలు గెలుచుకుందని అందులో ఉన్న సారాంశం. కాసేపటి తర్వాత నెంబర్‌ నుంచి ఫోన్‌చేసిన కేటుగాళ్లు మీరు లాటరీ గెలుచుకున్నారని, జీఎస్టీ, గిఫ్ట్‌ ట్యాక్స్‌ తదితరాలు రూ. 6 లక్షలు ముందస్తుగా చెల్లిస్తే వెంటనే మీ బ్యాంకు ఖాతాకు రూ. 25 లక్షలు జమ అవుతాయని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన హుస్సేన్‌ రూ. 6 లక్షలు డిపాజిట్‌ చేశాడు. తర్వాత ఆగంతకుల ఫోన్‌ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మెసేజ్‌ కూడా బల్క్‌ మెసేజ్‌ ద్వారా ఉండటం వల్ల నెంబర్‌ కనుక్కోలేకపోయాడు. మోసపోయానని గ్రహించి సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.


ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళకు వేధింపులు..

ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఉన్న నగరానికి చెందిన మహిళను కొందరు పోకిరీలు వేధింపులకు గురిచేశారు. అయితే వారు ఆమెకు తెలిసినవారు కావడంతో పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు పద్ధతి మార్చుకోలేదు. అదే తరహాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్‌ చేస్తుండటంతో బుధవారం బాధితురాలు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. మురళి, అశ్విన్‌ అనే యువకులు తనను వేధిస్తున్నారని ఆధారాలతో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-06T19:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising