ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weather Alert: రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు..!

ABN, First Publish Date - 2022-07-22T21:06:46+05:30

నేటి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతోంది. ట్రాఫిక్ జామ్‌తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు మూడు గంటల్లో నగరంలో పలు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేటి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతోంది. ట్రాఫిక్ జామ్‌తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు మూడు గంటల్లో నగరంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్ష పాతం నమోదవ్వచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు(DRF- Disaster Response Force) అప్రమత్తమయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.  

ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షియర్ జోన్ ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2022-07-22T21:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising