ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత శిక్షణకు Last Chance.. మరో వెయ్యి మందికి..

ABN, First Publish Date - 2022-05-29T15:05:24+05:30

హైదరాబాద్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ (Police) ఉద్యోగ అభ్యర్థులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు మరో అవకాశం

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ (Police) ఉద్యోగ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణలో చేరేందుకు అర్హులైన వారికి నగర సీపీ సీవీ ఆనంద్‌ మరో అవకాశం కల్పించారు. పోలీస్‌ ఉద్యోగాలకు (Police Jobs) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆయా జోన్లలో శిక్షణ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న అధికారుల వద్ద పేర్లు నమోదు చేయించుకొని ఉచిత శిక్షణ పొందవచ్చని తెలిపారు. హైదరాబాద్‌ పోలీసులు (Hyd Police) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన దాదాపు 7,500 మందికి జోన్లవారీగా 11 శిక్షణ కేంద్రాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. గడువును పెంచడం ద్వారా మరో వెయ్యి మంది శిక్షణ తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.


రూ. 8 లక్షల చెక్కు అందజేత.. 

రాచకొండ (Rachakonda) పోలీసులు నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఉచిత పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణకు, పోలీస్‌ వెల్ఫేర్‌కు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఆర్‌కేఎస్సీ) విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ జనరల్‌ సెక్రటరీ సతీష్‌ వడ్లమాడి, ట్రెజరర్స్‌ గగన్‌ కోహ్లి, సావిత్రి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ను కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం కలిసి రాచకొండ పోలీస్‌ వెల్ఫేర్‌ కోసం రూ.5లక్షలు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ శిక్షణకు రూ. 3లక్షల చెక్కులను విడివిడిగా అందజేశారు.

Updated Date - 2022-05-29T15:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising