కేఆర్‌ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై బదిలీ
ABN, First Publish Date - 2022-12-07T04:01:51+05:30
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యుడు బి.రవికుమార్ పిళ్లై బదిలీ అయ్యారు.
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యుడు బి.రవికుమార్ పిళ్లై బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలోని కేంద్ర జలవనరుల సంఘానికి బదిలీ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవికుమార్ పిళ్లై రిజర్వాయర్ల యాజమాన్య కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు.
Updated Date - 2022-12-07T04:01:52+05:30 IST