ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2022-06-30T16:44:15+05:30

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)లేఖ (Letter) రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి (ESI Hospital) నిర్మాణానికి.. అవసరమైన ఐదు ఎకరాల భూమి కేటాయింపుపై సీఎంకు లేఖ రాశారు. భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆస్పత్రికి 5 ఎకరాల భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.


కాగా జులైలో హైదరాబాద్‌ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జరగనున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకుపోవాలని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూలు ఇదీ..


జూలై 1

మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్‌ పట్టణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొని 4 గంటలకు హెచ్‌ఐసీసీ లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నడ్డా ప్రారంభిస్తారు.రాత్రి 7 గంటలకు నోవాటెల్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశం. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, ప్రతిపాదిత తీర్మానాలపై సమీక్ష. రాత్రి 8.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.


జూలై 2

ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.


జూలై 3

ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపు. సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసం. 4.30 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు పాల్గొంటారు.


జూలై 4

పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బయలుదేరి భీమవరం వెళతారు.

Updated Date - 2022-06-30T16:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising