ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khairatabad ganesh: ఆలస్యంగా ప్రారంభంకానున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

ABN, First Publish Date - 2022-09-09T13:53:01+05:30

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం అవడానికి ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairataba maha ganesh) శోభాయాత్ర ప్రారంభం అవడానికి ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మహాగణపతి ఇంకా మండంలోనే ఉన్నాడు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పనులు ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉంది. ఈ కారణంగా అనుకున్న సమయం కంటే శోభాయాత్ర(Shoba yatra) రెండు మూడు గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


మరోవైపు వినాయక నిమజ్జనోత్సవాలకు ట్యాంక్ బండ్‌ (Tank bund) వద్ద బల్దియా (GHMC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar) చుట్టూ 33 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లను ఉంచారు. 40 వేల వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74 బేబీ పాండ్స్ అధికారులు ఏర్పాటు చేశారు. శోభా యాత్రకోసం మొత్తం 168 గణేశ్ యాక్షన్ టీమ్స్‌ను నియమించారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉండనున్నారు. 

Updated Date - 2022-09-09T13:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising